అందుకే ఆర్టీసీ ఆస్తులు లీజుకు ఇచ్చాము: ఎండీ తిరుమల రావు!

-

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి మంచి కోసం ఏ పని చేసినా విమర్శించడం పనిగా పెట్టుకున్నారు ప్రతిపక్ష నాయకులు. తాజాగా ఏపీ ఆర్టీసీ ఆస్తులను ఇస్తున్నారు అన్న అంశంపై తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అయితే దీని వెనుక ఉన్న అసలు విషయాన్ని ఆర్టీసీ ఎండీ తిరుమల రావు వివరించారు. ఆర్టీసీ ఆస్తులను లీజుకు ఇస్తున్నాము తప్ప అమ్మడం లేదని ముందుగా క్లారిటీ ఇచ్చారు, ఇలా ఖాళీగా ఉన్న ఆర్టీసీ ఆస్తులను లీజుకు ఇవ్వడం ద్వారా సంస్థకు ఎంతో కొంత ఆదాయం వస్తుందన్న మంచి ఆలోచనతోనే ఇలా చేశామని తెలిపారు. ఇలా అయినా ప్రభుత్వానికి కొంత మేరకు భారం తగ్గతుందని అర్థమయ్యేలా వివరించారు.

ఇప్పటికే ఆర్టీసీ అప్పులలో ఉన్న విషయం తెలిసిందే. ఈ విధంగా లీజు ద్వారా వచ్చే డబ్బుతో అప్పులను కూడా తీర్చవచ్చని ద్వారకా తిరుమలరావు విజయవాడలో జరిగిన ఆర్టీసీ ఈయూ రాష్ట్ర మహాసభల్లో చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news