తెలంగాణ అప్పు రూ. 3,66,306 కోట్లు

-

తెలంగాణ రాష్ట్రం 2023 సంవత్సరం నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం మొత్తం రూ.3,66,306 కోట్ల అప్పులు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్ సభలో బీఆర్ఎస్ లోక్ సభాపక్షనేత నామ నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు నిర్మలమ్మ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2019 నుంచి 2023 ఆర్థిక ఏడాది వరకు తెలంగాణ చేసిన అప్పుల వివరాలను వెల్లడించారు.

2019 ఆర్థిక ఏడాదిలో రూ.1,90,203 కోట్లు.. 2020 సంవత్సరంలో.. రూ.2,25,418 కోట్లు.. 2021 ఏడాదిలో రూ. 2,71,259 కోట్లు.. 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,14,136 కోట్లు.. ఇక 2023 సంవత్సరంలో రూ. 3,66,306 కోట్లు అప్పులు చేసినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ పేరిట రూ.1,407.97 కోట్లు.. హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట రూ.526.26 కోట్లు.. కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ కింద రూ.6528.95 కోట్లు.. క్రెడిట్ ఫెసిలిటీ ఫెడరేషన్ నుంచి టీఎస్సీఎస్సీఎల్ రూ.15,643 కోట్లు.. టీఎస్ మార్క్ ఫెడ్ రూ.483 కోట్లు.. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నిధి నుంచి రూ.4,263 కోట్లు.. వేర్ హౌసింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ నిధి నుంచి రూ.66.54 కోట్లు అప్పు తీసుకున్నట్లు వెల్లడించారు. వీటితో కలిపి 2023 మార్చి నాటికి మొత్తం రాష్ట్ర సర్కార్ అప్పు రూ.3,66,306 కోట్లుగా ఉందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news