తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేంద్రం పై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్ర విధానాలతో దేశంలో రైతాంగం బాగా దెబ్బ తిన్నదని.. దేశ ప్రజల్లో ద్వేషం, అసహనం పెరిగిపోతున్నాయి అన్నారు. ప్రధాని మోడీ చేసిన ఒక వాగ్దానం కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నీతి అయోగ్ అనేది ఒక నిరర్ధక సంస్థ గా మారిపోయిందని.. నీతి అయోగ్ లో మేధోమదనం జరగడం లేదన్నారు.
నీతి అయోగ్ భజన బృందం గా మారిపోయింది అన్నారు సీఎం కేసీఆర్.15వ ఆర్ధిక సంఘం 6వేల కోట్ల గ్రాంట్ ఇవ్వమంటే ఆరు పైసలు కూడా ఇవ్వలేదని.. కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయలు వస్తున్నట్లు బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.రేపు దిల్లీలో జరిగే నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేకపోవడం వల్లే తాను ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. లేఖ ద్వారా నేరుగా ప్రధాన మంత్రి మోదీకి తన నిరసనను తెలియజేస్తున్నట్లు చెప్పారు.