మెదక్ ఎంపీగా పోటీ చేయాలని ఇంట్రెస్ట్ లేదు : జగ్గారెడ్డి

-

మెదక్ ఎంపీగా పోటీ చేయాలని ఇంట్రెస్ట్ లేదు నాకు లేదని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. మెదక్ ఎంపీగా కాంగ్రెస్  పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్లే అభ్యర్థి అన్నారు.  టైం బాగా లేక సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా ఓడిపోయానని తెలిపారు. సంగారెడ్డిలో ఓడిపోయిన.. మా ప్రజలు రెస్ట్ ఇచ్చారు. ఐదేళ్లు రెస్ట్ ఇచ్చారు.. వారికి కృతజ్ఞతలు తెలిపారు.

గెలిపిస్తే పని చేస్తా.. ఓడకోడితే రెస్ట్ తీసుకుంటానని స్పష్టం చేశారు. తాను గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నానని తెలిపారు జగ్గారెడ్డి. మరోవైపు పొన్నం ప్రభాకర్ మీద.. బండి సంజయ్ మాటలు సరికాదు.. పొన్నం కి క్షమాపణ చెప్పు అని కోరారు. శ్రీరాముడు దేవుణ్ణి.. మోడీ.. సంజయ్.. కిషన్ రెడ్డి లే మొక్కుతున్నట్టు.. దునియాలో ఎవరు మొక్కడం లేదన్న బిల్డప్ ఇస్తున్నారు.  శ్రీరాముడు ఆదర్శ మూర్తి.. రానున్న తరాలకు ఆదర్శం అన్నారు.  ఆదర్శంగా బతకాలి అని చెప్పాడు రాముడు.. కానీ  రాముడి పేరు మీద ఓట్లు అడిగి బతుకుతున్నారు బీజేపీ నేతలు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news