ఎన్ని ఆటంకాలు ఎదురైనా మూసీ ప్రక్షాళన పూర్తి చేస్తామని సినిమాటోగ్రఫీ, రహదారులు, భవనాల శాఖ మంత్రి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లోని నోవాటెల్ లో అసోచామ్ ఆధ్వర్యంలో అర్బన్ ఇన్ ప్రా స్ట్రక్చర్ సమిట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. మూసీని సుందరీకరించి ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామన్నారు. మూసీ కంటే ప్రమాదకరమైన సబర్మతిని మంచినీటి సరస్సుగా మార్చారని గుర్తు చేసారు.
హైదరాబాద్ మహానగర జనాభా కోటిన్నర దాటిందని.. నగరంలో నాలుగు మేయర్ స్థానాలు ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉందని తెలిపారు. అమెరికా తరువాత అధిక బహుళజాతి కంపెనీలు హైదరాబాద్ రూపు రేఖలు మారిపోతాయని.. రెండు నెలలో టెండర్లు పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.