కాసేపటి క్రితమే సినీ ఇండస్ట్రీని దుఃఖసముద్రంలో మునిగిపోయే వార్త ఒకటి తెలిసింది. ప్రముఖ మరాఠీ నటుడు రవీంద్ర మహాజన్ (77) హఠాత్తుగా మరణించారన్న వార్త అభిమానులను మరియు సినిమా ఇండస్ట్రీని తీవ్ర నిరాశలో ఉండేలా చేసింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం రవీంద్ర మహాజన్ పుణెలోని తన నివాసంలో నివాసం ఉంటున్నారు, కానీ ప్లాట్ లో గత మూడు రోజుల నుండి బయటకు రాకుండా, సిబ్బందికి గానీ లేదా బంధువులకు గానీ చుట్టుపక్కల వారికి గానీ తెలియకుండా ఇంట్లోనే ఉండిపోయారట. కానీ ఈ రోజు ఇంటిలో నుండి దుర్గంధమైన వాసనా వస్తున్నట్లు గమనించిన చుట్టుపక్కల వారు పూణే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇంటిలోకి వెళ్లి చూడగా రవీంద్ర మహాజన్ అప్పటికే చనిపోయినట్లు తెలుస్తోంది. కానీ పోలీసుల సమాచారం ప్రకారం చనిపోయి మూడు రోజులు అయిందట.
కానీ ఇతను ఆత్మహత్య చేసుకున్నాడా ? లేదా ఎవరైనా హత్య చేశారా ? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. రవీంద్ర మహాజన్ తన సినిమా కెరీర్ ను సౌత్ హిందుస్థానీ తో స్టార్ట్ చేసి, చివరగా పానిపట్ చిత్రంతో ముగించారు.