హీరో నవదీప్‌కు హైకోర్టులో నిన్న షాక్ తగిలిన విషయం తెలిసిందే. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది కోర్టు. ఇటీవలే ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది. నవదీప్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు తమ పిటిషన్ లో కోరారు. ఈ కేసులోని నిందితులతో నవదీప్ కు సంబంధాలు ఉన్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు… 41 ఏ కింద నోటీసులు ఇచ్చి నవదీప్ ను విచారించాలని ఆదేశించింది.
తాజాగా మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్ కి నోటీసులు అందజేసింది నార్కొటిక్ బ్యూరో. నవదీప్ 37వ నిందితుడుగా ఉన్నాడు.. ఈనెల 23న హెచ్-న్యూ కార్యాలయంలో హాజరు కావాలని నవదీప్ ఇంటివద్ద నోటీసులు అందజేశారు. నవదీప్ కి 41 ఏ కింద నోటీసులు జారీ చేసింది నార్కొటిక్ బ్యూరో. ముఖ్యంగా డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశారు. ఎక్కడికి నుంచి ఎక్కడికి వచ్చాయనే కోణంలో 23న విచారణ చేపట్టనున్నారని తెలుస్తోంది. నవదీప్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. నవదీప్ స్నేహితుడు రాంచంద్ తో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి.