హైదరాబాద్‌ వాసులకు శుభవార్త..2075 వరకు తాగునీరు కొరతకు చెక్‌

హైదరాబాద్‌ వాసులకు శుభవార్త చెప్పారు మంత్రి కేటీఆర్‌. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సుంఖిశాలలో 1450 కోట్ల వ్యయంతో జంటనగరాలకు తాగునీరు అందించే ఇంటేక్ వెల్ కు, సుంకిశాల నుండి 17కిలో మీటర్ల దూరంలో ఉన్న కొదండాపూర్ లో నిర్మించే పంపింగ్ హౌజ్ కు శంకుస్దాపన చేశారు మంత్రి కేటీఆర్.

ఎడాది కాలంలో పనులు పూర్తి అయ్యేలా కార్యాచరణ రూపొందించారు… ఈ నిర్మాణం పూర్తి అయితే నాగార్జునాసాగర్ లో 475 అడుగులకు నీటిమట్టం చేరినా మోటార్ల సాహాయంతో జంటనగరాలకు తాగు నీటిని తరలించవచ్చు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. జంట నగరాల ప్రజకలకు ఈరోజు శుభ దినం..2075 వరకు జంటనగరాలకు తాగునీరు కొరత ఉండదని ప్రకటన చేశారు.

తాగునీరు తోపాటు… పరిశ్రమ లకు కావలసిన నీరు అందిస్తాము…విశ్వ నగరంగా హైదరాబాద్ ను తీర్చడమే కేసీఆర్ లక్ష్యమన్నారు. హైదరాబాద్ ను తెలంగాణ కు మాత్రమే రాజధానిగా చూడొద్దు.. అంతర్జాతీయ సౌకర్యాలు ఉన్న నగరంగా.. దేశానికి ఒక దిక్సూచి గా హైదరాబాద్ అభివృద్ధి చెందాలి.. వందేళ్ల దార్శనికత కలిగిన నేత కేసీఆర్ హైదరాబాద్ లో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వెల్లడించారు. 100రోజుల విజన్ తో వచ్చే నేతలు మనకు అవసరం లేదని స్పష్టం చేశారు.