ఈ నెల 15న మెదక్ జిల్లాలో KCR బహిరంగ సభ

-

ఈ నెల 15న మెదక్ జిల్లాలో BRS భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకి మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. రైతు సమస్యలపై బహిరంగ సభ నిర్వహిస్తున్న BRS…ఈ సభకు లక్షల్లో జనాలు వచ్చేలా ప్లాన్‌ చేస్తోంది. ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి రాజీనామా గులాబీ పార్టీకి పెద్ద తలనొప్పులు తీసుకువచ్చింది.

ఇచ్చిన టికెట్ కాదని కాంగ్రెస్లో చేరారు కడియం శ్రీహరి కుటుంబ సభ్యులు. దీంతో వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వాలనే దానిపై కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆలోచన చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది.వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పెద్ది స్వప్న ను ఫైనల్ చేసేందుకు సిద్ధమయ్యారట. పెద్ది సప్న ఎవరో కాదు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య. పెద్ది స్వప్న కూడా ఎస్సీ మాల సమాజక వర్గానికి చెందినవారు. వరంగల్ ఎంపీ టికెట్ కూడా దళితులకు కచ్చితంగా ఇవ్వాల్సిందే. అందుకే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెళ్లి స్వప్నకు ఇచ్చేందుకు కెసిఆర్ రంగం సిద్ధం చేశారట.

Read more RELATED
Recommended to you

Latest news