తెలంగాణలో 1.07 లక్షలకు చేరిన ఇంజినీరింగ్‌ సీట్లు

-

తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్లు తాజాగా 1.07 లక్షలకు చేరాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం బీటెక్‌ సీట్లు 92,528 అందుబాటులో ఉండగా.. వాటికి మరో 14,565 సీట్లు కొత్తగా కలవనున్నాయి. ప్రభుత్వం వాటికి అనుమతి ఇస్తూ జీఓ జారీ చేసింది. అంటే మొత్తం సీట్లు 1,07,093కు పెరిగాయి. కన్వీనర్‌ కోటా కింద కౌన్సెలింగ్‌ ద్వారా 66,112 సీట్లను భర్తీ చేస్తామని ఎంసెట్‌ ప్రవేశాల అధికారులు ప్రకటించగా.. తాజాగా ప్రభుత్వం అనుమతించిన వాటిల్లో 10,196 సీట్లు కన్వీనర్‌ కోటాలో చేరనున్నాయి. ఫలితంగా ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేసే సీట్ల సంఖ్య 76,308కు చేరనుంది.

పదుల సంఖ్యలో ఇంజినీరింగ్‌ కళాశాలలు మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఈసీఈ తదితర బ్రాంచీల్లో విద్యార్థులు చేరటం లేదని ఆ సీట్లను తగ్గించుకొని.. అంతే సంఖ్యలో కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, ఏఐ అండ్‌ ఎంఎల్‌ తదితర బ్రాంచీల్లో పెంచుకుంటామని ఏఐసీటీఈ, జేఎన్‌టీయూహెచ్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందుకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. సీట్ల మార్పునకు ప్రభుత్వామోదం అవసరం. ఈ క్రమంలో జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు సర్కారుకు దస్త్రాన్ని పంపారు. ఎట్టకేలకు ప్రభుత్వం 6,930 సీట్లకు అనుమతి ఇచ్చింది. Engineering seats in telangan, one lakh Engineering seats in telangana

Read more RELATED
Recommended to you

Latest news