హైదరాబాద్ లో భారీగా పడిపోయిన ఉల్లి ధరలు..రూ.100కే 8 కేజీలు!

-

ఎప్పటికప్పుడు రేటు పెరుగుతూ జనాన్ని ఏడిపించే ఉల్లి ఈసారి మాత్రం భారీగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో అయితే దారుణంగా రెట్లు పడిపోయాయి. మొన్నటి వరకు రూ.100 కు 3-4 కేజీల ఉల్లి అమ్మగా, ఇప్పుడు రూ. 100 కే 6-8 కేజీల ఉల్లి ఇస్తున్నారు.

మలక్పేట హోల్సేల్ మార్కెట్లో కేజీ రూ.10-13 వరకు అమ్ముతున్నారు. 2-3 రోజుల క్రితం రూ. 20 కి కేజీ వరకు విక్రయించామని, మార్కెట్ కు భారీ ఎత్తున ఉల్లి రావడంతో ధర తగ్గుతోందని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు టమాటాల ధర పెరుగుతుంది. కేజీ రూ. 40-50 వరకు పెరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news