తెలంగాణకు కేంద్రం శుభవార్త. తెలంగాణలో రూ. 10, 578 కోట్ల అంచనా వ్యయంతో మరో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే నిర్మించనున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం అయిన ట్వీట్ చేశారు.
నాలుగు వరసల్లో నిర్మించే ఈ జాతీయ రహదారి మంచిర్యాల జిల్లా అన్నారం గ్రామంలో ప్రారంభమై ఆసిఫాబాద్ జిల్లాలోని వీరవెల్లి గ్రామం మీదుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా వరకు 63 కిలోమీటర్ల మేర సాగుతుందని తెలిపారు.
“₹10,578 కోట్ల అంచనావ్యయంతో తెలంగాణ రాష్ట్రంలో మరో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే ను నిర్మించనున్నారు.4 లేన్ల ఈ జాతీయ రహదారి మంచిర్యాలజిల్లా అన్నారంగ్రామంలో ప్రారంభమై అసిఫాబాద్ జిల్లాలోని వీరవెల్లిగ్రామం మీదుగా మహారాష్ట్రలోని గడ్చిరోలిజిల్లా వరకు 63 కి.మీ.లమేర నిర్మాణం జరగనుంది.” అని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.
₹10,578 కోట్ల అంచనావ్యయంతో తెలంగాణ రాష్ట్రంలో మరో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే ను నిర్మించనున్నారు.4 లేన్ల ఈ జాతీయ రహదారి మంచిర్యాలజిల్లా అన్నారంగ్రామంలో ప్రారంభమై అసిఫాబాద్ జిల్లాలోని వీరవెల్లిగ్రామం మీదుగా మహారాష్ట్రలోని గడ్చిరోలిజిల్లా వరకు 63 కి.మీ.లమేర నిర్మాణం జరగనుంది. pic.twitter.com/Qb1Anr1Y8a
— G Kishan Reddy (@kishanreddybjp) February 24, 2023