కార్మికుల భవిష్యత్ కి భరోసా ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి

-

కార్మికులకు బోనస్ ను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా పండుగ కంటే ముందే అందించడం ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజా భవన్ లో సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీలో కార్మికులనుద్దేశించి మాట్లాడారు భట్టి విక్రమార్క. గుండు సూది కూడా ఉత్పత్తి చేసుకోలేని భారతదేశాన్ని మిశ్రమ ఆర్థిక విధానంతో గొప్ప పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దిన నేత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు అని.. ఆయన అడుగు జాడల్లో నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.

అదే ఆలోచనతో తెలంగాణలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిని కాపాడుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని చెప్పారు. సీఎం కూడా సింగరేణి కార్మికుల కోసం ఏం చేయడానికి అయినా సిద్దంగా ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ లా తూ తూ మంత్రంగా పని చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని.. సంస్థను అభివృద్ధి చేయడానికి ఏం చేయడానికి అయినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news