ఎల్బీస్టేడియంలో నిర్వహించిన బీసీ సభకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరై మాట్లాడారు. తెలంగాణ సాధించుకోవడంలో విజయం సాధించాం. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందే తెలంగాణ ఉద్యమం. కానీ ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అన్ని అందాయా అన్నది ఇప్పుడు ప్రశ్న అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రధాని దేశానికి ఎన్నో తీసుకొచ్చారు. దేశ ప్రయోజనాలే మోడీని నిర్దేశిస్తాయి. ఎన్నికల ప్రయోజనాలు కాదు అన్నారు పవన్ కళ్యాణ్.
ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు చేసేవారు. దేశ ప్రయోజనాలు ప్రధాని లక్ష్యమని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు ఎంత మంది చనిపోయారో మనకు తెలిసిందే. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉగ్రవాదుల దాడులు తగ్గిపోయాయి. డిజిటల్ పేమెంట్స్ 2014లో పదో స్థానంలో ఉన్న భారత్. ప్రస్తుతం 5 స్థానంలో కొనసాగుతుంది. బీసీలను ముఖ్యమంత్రిని చేస్తామని మాటలతో చెప్పలేదు.. సీటుతో చెప్పిందన్నారు. భాగవతం పుట్టిన నేలలో బతుకు భారం కాకూడదు అన్నారు. బీసీ ముఖ్యమంత్రి చేయడానికి జనసేన మద్దతు తప్పకుండా ఉంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశం బాగుపడాలంటే మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ కావాలన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి అండగా ఉంటామని తెలిపారు.