వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి దగ్గర జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించారు. సభ ప్రాంగణంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ కి ఒక విశిష్టత ఉందని.. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు రెండు మాత్రమే ఉన్నాయి. ఇక తెలంగాణ ప్రజలు గొంతుగా పార్టీ పేరు తెచ్చుకుంది టీఆర్ఎస్. ప్రజలు ఏ బాధ్యత ఇచ్చిన దానిని ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తున్న పార్టీ అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఉద్యమ జిల్లాలో 1250 ఎకరాల ఏర్పాట్లు పరిశీలించామని తెలిపారు కేటీఆర్. రాష్ట్రంలో ఏ మూల నుంచి వచ్చే ఏ సోదరుడికి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. 40 వేల వాహాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. వాహనాలు దూరం పెట్టి నడుచుకుంట రాకుండా సభ వేదిక దగ్గరనే పార్కింగ్ సౌకర్యం కల్పించార. నాలుగు ఏరియాల్లో పార్కింగ్ సౌకర్యాలు ఉంటాయి. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మంచినీటి సౌకర్యాలు కల్పిస్తున్నామని.. అలాగే వైద్య బృందాలను కూడా అందుబాటులో ఉంచామని వెల్లడించారు కేటీఆర్.