కేరళ ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారు – కేరళ సీఎం

జాతీయ పార్టీగా అవతరించిన భారత రాష్ట్ర సమితి తొలి బహిరంగ సభ ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ బహిరంగ సభకి ముఖ్య అతిథులుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పినరై విజయన్, భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా, పలువురు జాతీయ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ మాట్లాడుతూ.. దేశ సార్వభౌమత్వానికి ఇది పరీక్షా సమయం అన్నారు.

రాజ్యాంగాన్ని కాపాడేందుకు బిజెపికి వ్యతిరేకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బిజెపి కార్పొరేటర్లకు కొమ్ముకాస్తుందని ఆరోపించారు కేరళ సీఎం. ప్రజాస్వామ్యానికి బిజెపి ముప్పుగా మారిందన్నారు. ఈ సభ దేశానికి ఓ దిక్సూచి లాంటిదన్నారు. కేరళ ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని చెప్పారు. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోడీ పాలన కొనసాగుతుందన్నారు.