ఖమ్మం జిల్లా ప్రజలు ఏనాడు బీఆర్ఎస్ ను నమ్మలేదు : సీఎం రేవంత్ రెడ్డి

-

18 సంవత్సరాల్లో ఏ రోజు ఎప్పుడూ వచ్చినా ఖమ్మం జిల్లా యువకులు, మా మిత్రులు వేలాది మంది అండగా నిలబడి గుండెల్లో పెట్టి చూసుకుంటున్నందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు.. మొన్న జరిగిన 10 అసెంబ్లీ స్థానాలకు 09 అసెంబ్లీ స్థానాలు గెలిపించినందుకు ధన్యవాదాలు. భద్రాచలంలో శ్రీరాముడి ఆశీస్సులు తీసుకొని ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించినట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ ని గెలిపించారు. 

పేద ఆడబిడ్డల సొమ్మును అప్పనంగా దోచుకున్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నాం. 1969 ఉద్యమం ఖమ్మం జిల్లా నుంచే పురుడు పోసుకుంది. ఖమ్మం జిల్లా ప్రజలు ఏనాడు బీఆర్ఎస్ ని నమ్మలేదు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా సోనియాగాంధీ తొలివిడుతలోనే ప్రకటించింది. 1లక్ష 50వేల మెజార్టీతో బలరాం నాయక్ ని గెలిపించాలని కోరారు. కేసఆర్ ని 100 మీటర్ల గోతిలో పాతిపెట్టిన ఘనత ఖమ్మం ప్రజలది అని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ రూ.400 కి సిలిండర్ అందిస్తే.. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు రూ.1200 చేసిందన్నారు. 90 రోజుల్లో 30వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత మాది అన్నారు. బీఆర్ఎస్ అంటే.. బిల్లా రంగ సమితి..అని.. రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ.. కేడీ కలిసి కాంగ్రెస్ పార్టీ పై కుట్ర చేస్తున్నారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. 

 

Read more RELATED
Recommended to you

Latest news