మహిళా శక్తి అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తా : ప్రధాని మోడీ

-

మహిళా శక్తి అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తానని  ప్రధాని మోడీ పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన సశక్తే నారీ- వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని స్త్రీలను ఉద్దేశించి మాట్లాడారు. తాను మూడోసారి ప్రధానిగా గెలిస్తే దేశంలో మహిళల అభివృద్ధికి కొత్త అధ్యాయాన్ని లిఖిస్తానని ప్రధాని క్రైమ్ పాలిటిక్స్ బిజినెస్ క్రీడలు సినిమా మోడీ పేర్కొన్నారు. ఏ సమాజం అయితే మహిళల అభివృద్ధికి అవకాశాలు కల్పిస్తుందో ఆ సమాజం వృద్ధి చెందుతుందని తాను నమ్ముతానని అన్నారు. తమ ప్రభుత్వం వనితల కోసం అమలుచేసిన కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉదహరించారు.


కార్యక్రమంలో భాగంగా స్వయంసహాయక బృందాలకు బ్యాంకు రుణాలుగా దాదాపు రూ.8,000 కోట్లను మోదీ పంపిణీ చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో అధికారాన్ని నిలుపుకోగలమన్న విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. వివిధ ప్రభుత్వ పథకాల కింద రూ.8 లక్షల కోట్లకు పైగా నగదును మహిళలకు పంపిణీ చేశామని ప్రధాని మోడీ తెలిపారు. ఇప్పటివరకు కోటి మంది స్త్రీలు లఖపతి దీదీలుగా మారారని ఆయన చెప్పారు. మహిళలకు చిన్న సహాయం చేసినా వారు తిరిగి ఇతరులకు సహాయం చేస్తారనే విషయం తన అనుభవం ద్వారా తెలుసుకున్నానన్నారు. తమ కుటుంబాల గురించి మాత్రమే ఆలోచించే రాజకీయ నాయకులు దీనిని ఎప్పటికీ అర్ధం చేసుకోలేరని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news