ఆంధ్రాలో పోటీ చేస్తామని, ఆంధ్రా ప్రజలు తెలంగాణ పథకాలను కోరుకుంటున్నారని బీఆర్ఎస్ అధినేత జాతీయ రాజకీయాల్లోకి వస్తామని చెప్పిన సమయంలో అన్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన సమయంలో దేశంలో మొత్తం 150 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయాలని పెద్ద ప్రణాళికలే వేసుకున్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోవడంతో ఆ ప్లాన్లన్నీ వృథా అయిపోయాయి. అయితే తాజాగా కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ సంచలన విషయాలను వెల్లడించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 400 స్థానాలు ఖాయమని ధీమా వ్యక్తం చేసిన మోదీ.. ఇప్పటికే ఎన్డీయే కూటమిలో పార్టీలకు 360 స్థానాలు ఉన్నాయని గుర్తు చేశారు. బీజేపీకి బయట నుంచి మద్దతిస్తున్న బీజేడీ వంటి పార్టీలను కలుపుకుంటే ఎన్డీయే బలం 400 సీట్లకు చేరుతుందని తెలిపారు. అయితే కేసీఆర్ మద్దతును స్వీకరిస్తారా అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆ అవసరమే తమకు రాదని అన్నారు. గతంలో ఆయన ఎన్డీయేలోకి వస్తామంటే తిరస్కరించామని గుర్తు చేశారు. ఈసారి కూడా కే సీఆర్ ను ఎన్డీయే కూటమిలో చేర్చుకోబోమని, ఆయనకు అంత సీన్ లేదంటూ ప్రధాని మోదీ తేల్చేశారు.