దిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ అవినీతి : ప్రధాని మోదీ

-

తెలంగాణను దోచుకున్న వారిని విడిచిపెట్టేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకునేందుకే రాజకీయాలు చేస్తాయని విమర్శించారు. దేశంలో ఏ దోపిడీని పరిశీలించినా.. దాని వెనుక కుటుంబ పార్టీలే ఉన్నాయని ఆరోపించారు. 2జీ స్పెక్ట్రమ్‌ కేసులో డీఎంకే , నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ పేరు బయటకు వచ్చిందని, అవి రెండు కుటుంబ పార్టీలేనన్న ఆయన.. ఇప్పుడు ఆ జాబితాలో బీఆర్ఎస్ చేరిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరంలో, దిల్లీ మద్యం అంశంలోనూ అవినీతికి పాల్పడిందని ఆరోపణలు చేశారు.

‘ఆంగ్లేయులు, రజాకార్లతో పోరాడిన నేల ఇది. కాంగ్రెస్‌ తెలంగాణ ఆశలను నాశనం చేసింది. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసింది. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను దోచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్‌ తెలంగాణను తమ ఏటీఎంగా మార్చుకుంది. తెలంగాణ డబ్బు ఇప్పుడు దిల్లీ చేరుతోంది. ఒక దోపిడీదారు.. మరో దోపిడీదారుపై పోరాడలేరని ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ దోపిడీపై కాంగ్రెస్‌ మౌనం వహిస్తోంది. కాళేశ్వరం దోపిడీని కాంగ్రెస్‌ ప్రశ్నించడం మానేసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్.. ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్.. రెండూ బీజేపీని విమర్శిస్తున్నాయి.’ అని మోదీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news