BREAKING: ఎమ్మెల్యే పల్లా, రాకేష్ రెడ్డిలు అరెస్ట్ అయ్యారు. గాంధీ హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్‌ను పరామర్శించేందుకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డిలను అడ్డుకున్నారు పోలీసులు.

దీంతో.. గాంధీ హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం బలవంతంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డిలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరో 40 మంది బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ, ఓయూ నేతల అరెస్టు అయ్యారు. పల్లాను చంద్రాయన్ గుట్ట పీఎస్‌కు, రాకేష్ రెడ్డిని బొల్లారం పీఎస్‌కు తరలించారు.