BRS పార్టీ ఆఫీస్ ను తక్షణమే కూల్చేయండి అంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో… బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నల్లగొండ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ నిర్మించారని బాంబ్ పేల్చారు. 100 కోట్లు విలువైన ప్రభుత్వ స్థలంలో.. అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారని ఆగ్రహించారు.
BRS పార్టీ ఆఫీస్ తక్షణమే కూల్చేయాలనీ.. మున్సిపల్ కమి షనర్ కు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రూ. 100 కోట్ల భూమిలో పార్టీ ఆఫీస్ కడుతుంటే ఏం చేస్తున్నారని మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వ్యవహారాన్ని మానిటర్ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కి సూచనలు చేశారు.