ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఉన్న ఎదుర్కొంటున్న ఎస్‌ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసుల కస్టీడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఏడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయణ్ను పంజాగుట్టు పోలీసులు విచారణ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి 23వ తేదీ వరుకు కోర్టు కస్టడీకి కోర్టు అనుమతివ్వడంతో నేడు పోలీసులు ఆయణ్ను కస్టడీలోకి తీసుకోనున్నారు.
ప్రస్తుతం ప్రణీత్ రావు.. చంచల్ గూడా జైలులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు. గతేడాది డిసెంబర్ 4వ తేదీన ఎస్ఐబీలోని 17 కంప్యూటర్లలోని పాత హార్డ్ డిస్కులు మాయం చేసి కొత్తవి అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. పాత వాటిని ధ్వంసం చేశారని అనుమానిస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో అతనికి సహకరించిన అధికారుల వివరాలను పంజాగుట్టు పోలీసులు సేకరించనున్నారు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్ లను విశ్లేషించాలని ఉన్నాతాధికారులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రణీత్కు సహకరించిన వారెవరు? ఆయన వెనక ఇంకెవరెవరు ఉన్నారు? అనే అంశాలపై కస్టడీలో పోలీసులు విచారించనున్నట్లు సమాచారం.