BREAKING : కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో పొంగులేటి ?

-

BREAKING : కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలోనే.. బీఆర్‌ఎస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. తనతో వచ్చే నాయకులను కలుపుకుని ముందుకు వెళుతున్నారు.

ఈ తరుణంలోనే ఇవాళ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో నల్గొండ జిల్లాకు చెందిన చకిలం అనిల్ కుమార్ , ఆయన అనుచరులతో భేటీ అయ్యారు. ఇటీవలే అధికార బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన అనిల్ కుమార్ పొంగులేటి బాటలో పయనిచేందుకు సిద్ధం అయ్యారు. ఈ తరుణంలోనే పొంగులేటి కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని అని ఊహాగానాలు వస్తున్నాయి. దశల వారీగా పలు జిల్లాల నేతలతో పొంగులేటి సమావేశాలు నిర్వహించిన అనంతరం ఆయన తుది నిర్ణయం వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news