BREAKING : ఏపీ పదవ తరగతి ఫలితాలు విడుదల..ఇలా చెక్‌ చేసుకోండి

-

BREAKING : ఏపీ పదవ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. కాసేపటి క్రితమే…ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పదవ తరగతి ఫలితాలను రిలీజ్‌ చేశారు. ఏప్రియల్ 3 నుంచి 18 వరకు జరిగిన పదవ తరగతి పరీక్షలు జరిగాయి.

3449 పరీక్షా కేంద్రాలలో టెన్త్ పరీక్షలకు 6.64 లక్షల మంది విద్యార్ధులు కి హాజరయ్యారు. కేవలం 18 రోజులలోనే టెన్త్ ఫలితాలు విడుదల చేసింది ఎస్ ఎస్ సి బోర్డు. పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల‌ ప్రకటన వరకు పకడ్బందీగా నిర్వహించిన విద్యా శాఖ.. సిబీఎస్ఈ తరహాలో ఆరు సబ్జెక్ట్ లకే టెన్త్ పరీక్షలు నిర్వహించింది. లీకేజీ ఆరోపణలు రాకుండా టెన్త్ పరీక్షా కేంద్రాలని‌ నో మొబైల్ జోన్ గా ప్రకటించి పరీక్షలు నిర్వహించి విద్యా శాఖ.. సమస్యాత్మకమైన 200 పైన పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించింది.

ఏపీ పదవ తరగతి ఫలితాల కోసం ఈ వెబ్ సైట్ లో చెక్ చేసుకోండి

https://bse.ap.gov.in/
http://www.manabadi.co.in/

 

  • పరీక్షలకు నమోదు చేసుకున్న వారు 6, 64,152
  • పరీక్షలకు హాజరైన మొత్తం విద్యార్థులు
    6,09, 081
  • స్పాట్ వ్యాల్యుయేషన్ ఏప్రియల్ 19 నుంచి 26వ తేదీ వరకు పూర్తి చేశాం
  • 8 రోజుల్లో స్పాట్ వ్యాల్యుయేషన్
  • రికార్డు స్థాయిలో త‌క్కువ‌ రోజుల్లోనే ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన విద్యా శాఖ
  • ఉత్తీర్ణులైన విద్యార్థులు
  • ఉత్తీర్ణత శాతం 72.26
  • గత ఏడాది కంటే ఈసారి పెరిగిన ఉత్తీర్ణత శాతం
  • బాలికల్లో ఉత్తీర్ణత 75.38
  • బాలురుల్లో ఉత్తీర్ణత 69.27
  • పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన బాలికలు
    933 స్కూళ్ళల్లో వంద శాతం పాస్
  • 38 స్కూళ్ళల్లో సున్నా శాతం ఫలితాలు
    టాప్ లో పార్వతీపురం మన్యం జిల్లా 85 శాతం ఉత్తీర్ణత
  • లీస్ట్ లో నంద్యాల జిల్లా 60.39
    ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ లో 95.25 శాతం

Read more RELATED
Recommended to you

Latest news