75 కాలమ్స్ తో కులగణన సర్వే చేస్తున్నట్లు ప్రకటించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం రూరల్ మండలం కోట నారాయణపురం లో సమగ్ర కుటుంబ సర్వే ని ప్రారంభించిన సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఎన్నికల ముందు కులగణన చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని… 75 కాలమ్స్ తో కులగణన సర్వే చేస్తున్నారని తెలిపారు. ఆర్ధికంగా భారమైన కులగణన క్షుణ్ణంగా చేస్తామని… పూర్తి స్థాయిలో ఈరోజు నుంచే సర్వే మొదలైందని వెల్లడించారు.
సమగ్ర కుటుంబ సర్వే తో ఎవరికి ఏమేం అవసరం ఉన్నాయో ప్రభుత్వం కి తెలుస్తుందన్నారు. ప్రతి ఎన్యుమరేటర్ కి 170 ఇళ్ల వరకు సర్వే చేస్తారని వివరించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రతిరోజూ చేసిన సర్వేని ఆన్లైన్లో నమోదు చేస్తారన్నారు. దేశంలో ఎక్కడైనా కులగణన చేయాలంటే తెలంగాణ రాష్ట్రం ని మోడల్ గా తీసుకోవాలని తెలిపారు. కులగణన ను అధికారులు బాధ్యతగా నిర్వహించాలని ఆదేశించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.