నా తల్లిని అన్నావ్‌…నువ్వు సమాధి అయిపోతావు? – పొన్నం వార్నింగ్‌

-

తన తల్లిపై బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్‌ ఇచ్చారు. నా తల్లిని అన్నావ్‌…నువ్వు సమాధి అయిపోతావు? అంటూ పొన్నం ప్రభాకర్‌ వార్నింగ్‌ ఇచ్చారు. బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరలెపారని ఫైర్‌ అయ్యారు. 5 సంవత్సరాల పదవి కాలంలో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఏం చేసారని ప్రశ్నించాను..కానీ శ్రీరాముని పేరు తెరపైకి తెచ్చారని ఆగ్రహించారు. నేను ఎన్నడూ అలాంటి మాటలను రాముడి పట్టుక గురించి అక్షింతల గురించి మాట్లాడలేదన్నారు.

ponnam counter to bandi sanjay

నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు బండి మాట్లాడుతున్నారు.. ఇది ఎంత వరకు సమంజసం సభ్య సమాజాన్ని కోరుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. జన్మనిచ్చిన తల్లి నా తల్లి అయిన..ఇంకా ఎవరి తల్లి అయిన తల్లి అని తెలిపారు. అభివృద్ధికి సంబంధించినది ప్రశ్న అడిగితే..అతడు మాట్లాడిన మాట నా తల్లి జన్మకు సంబందించిన మాట.. సమాజం గమనించాలని కోరారు. ఆనాడు కేసీఆర్ హిందుగాళ్లు.. బొందుగాళ్ళు అంటే రాజకీయంగా ఎన్నికల్లో ఏవిధంగా వాడుకున్నారో….ఇప్పుడు తనను వాడుకుంటున్నాడని నిప్పులు చెరిగారు. శవం మీద పేలాలు ఏరుకునే రకం అంటూ బండి సంజయ్‌ పై ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news