తెలంగాణలో పాఠ్యాంశంగా విద్యుత్ పరిరక్షణ : మంత్రి జగదీశ్ రెడ్డి

-

తెలంగాణలో విద్యుత్ పరిరక్షణను పాఠ్యాంశంగా చేర్చే దిశగా చర్యలు తీసుకుంటామని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి తెలిపారు. దీనిపై పాఠశాల విద్యాశాఖకు లేఖ రాయాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మకు సూచించారు. రెడ్కో ఆధ్వర్యంలో ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

కాలుష్యం మానవజాతికి సమస్యగా మారిందని మంత్రి పేర్కొన్నారు. థర్మల్ విద్యుత్తు ఉత్పత్తితో తీవ్రంగా కాలుష్యం అవుతోందని తెలిపారు. ఉద్యమంలా కృషి చేస్తే తప్ప కాలుష్యాన్ని ఆపలేమని చెప్పారు. పునరుత్పాదక ఇంధనాన్ని వాడి కాలుష్య నివారణకు కృషి చేయాలని సూచించారు. ఇంధన పరిరక్షణ, కాలుష్యనియంత్రణకు రెడ్కో తీసుకుంటున్న చర్యలను అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news