రాజగోపాల్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే నేను గెలిపిస్తా – కెఏ పాల్

మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరో రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో తెలంగాణ పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి. అయితే రాజగోపాల్ రెడ్డి రాజీనామా పై స్పందించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.

రాజగోపాల్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. రాజగోపాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే తాను గెలిపిస్తానననీ.. ఒకవేళ బిజెపిలో చేరితే రాజగోపాల్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానన్నారు. ప్రజాశాంతి పార్టీలో చేరితే 60 శాతం ఓట్లు రాజగోపాల్ కే పడతాయని కేఏ పాల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనమైందని వ్యాఖ్యానించారు.