పవన్ కళ్యాణ్ పై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో ప్రజలను మత పరంగా పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నడంటూ ప్రకాశ్ రాజ్ స్పందించి విమర్శలు గుప్పించి సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి మద్య కొద్ది రోజులు మాటల వార్ నడిచింది. తాజాగా ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ పై ప్రకాశ్ రాజ్ విరుచుకుపడ్డారు.

పవన్ కళ్యాణ్ అంటే మీకు ఎందుకు మీకు అంత కోపం అని ప్రశ్నించగా.. దీనిపై ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ మూర్ఖత్వ, విధ్వంస రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అది నచ్చడం లేదు. ప్రజలు అతడిని ఎన్నుకున్నది  మతపరంగా విడదీసి విధ్వంస రాజకీయ చేయడానికి కాదు కదా అన్నారు. వీటిని ప్రశ్నించే వారు ఒకరు ఉండాలి కదా.. అదే నేను చేస్తున్నాను అని ప్రకాశ్ రాజ్ సమాధానం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news