ఎన్నడూ లేనంతగా తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యంగా రాజధాని భాగ్యనగరాన్ని ముంచెత్తుతున్నాయి. ఈ వరదలు వలన ఆస్తినష్టం ప్రాణ నష్టం జరుగుతోంది. అయితే తాజాగా TJS అధ్యక్షుడు మరియు ప్రొఫెసర్ కోదండరాం వర్షాలు విపరీతంగా పడడానికి గల కొత్త కారణాన్ని కనిపెట్టాడు. ఈయన తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హైద్రాబాద్ లాంటి మహా నగరంలో వరదల వలన నీరు రోడ్లపైన అలా నిలిచిపోతోంది. ఇది చాలా బాధాకరం అని అంటూనే ఈ పరిస్థితికి కారణం అధికార పార్టీ BRS అన్నారు. కేసీఆర్ నేతృత్వంలో BRS చేస్తున్న దందాలు, కబ్జాల వలన ఈ విధంగా వరదలు ముంచుకొచ్చాయి అంటూ ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చాడు కోదండరాం. వీరి అధికారంలోకి వచ్చాక దేనినీ విడిచి పెట్టకుండా కబ్జా చేస్తున్నారని.. హైదరాబాద్ ను డల్లాస్ న్యూయార్క్ లుగా మారుస్తామని చెప్పి ఒక వరదలకు నిలయంగా మార్చారని కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇంకా హైదరాబాద్ లో జరగాల్సిన అభివృద్ధి ఇంకా చాలా ఉందని.. దాని గురించి ఆలోచించే సమయమే కేసీఆర్ కు లేకుండా పోయిందంటూ మాట్లాడారు కోదండరాం.