సీఎం కేసీఆర్ ను మహారాష్ట్ర కు పంపిస్తాం – రఘునందన్ రావు

-

సీఎం కేసీఆర్ ను మహారాష్ట్ర కు పంపిస్తామని హెచ్చరించారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. మెదక్ కలెక్టరేట్ ముందు కొనసాగుతున్న పంచాయితీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నారు. పంచాయితీ కార్యదర్శుల సమ్మె కు సంఘీభావం తెలిపిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. సిఎం కెసిఆర్ పై ఫైర్ అయ్యారు.

పంచాయతీ కార్యదర్శిలను తీసేస్తా అంటే ఆరునెలల్లో ఎర్రబెల్లిని పీకేస్తామని వార్నింగ్ ఇచ్చారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. జీవితంలో మంత్రి పదవి కోసం సిద్ధాంతాన్ని మరిచి పార్టీ మార్చిన వ్యక్తి ఎర్రవల్లి అన్నారు. మంత్రి హరీష్ రావు గ్రామ సచివాలయంలో కూర్చొని సమస్యలు చూశారా అని నిలదీశారు. తెలంగాణ కు అనేక అవార్డులు వచ్చాయని గొప్పలు చెప్పుకుంటున్నారు.. జై తెలంగాణ అన్నోళ్లకు కేసీఆర్ దగ్గర ఏమి రావ్..సూట్కేసులు పట్టుకొచ్చినోళ్ళకు వస్తాయన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.

 

Read more RELATED
Recommended to you

Latest news