హైదరాబాద్: గాంధీభవన్‌లో ప్రారంభమైన టీపీసీసీ ప్రత్యేక విస్తృత సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, 300 మంది ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ఎంత సీనియర్ అయినా..మెరిట్ ఆధారంగానే టికెట్లు ఇస్తామని ప్రకటన చేశారు.
క్షేత్ర స్థాయి ఫీడ్ బ్యాక్ తీసుకుని టికెట్లు ఇస్తామన్నారు. వరంగల్ డిక్లరేషన్ రైతులకు, కాంగ్రెస్ పార్టీకి మధ్య నమ్మకం కలిగించేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అందరికీ అర్థం అయ్యేలా ప్రజలకు వివరించాలని ఆదేశించారు. వచ్చే నెల రోజుల్లోనే ఈ పని పూర్తి చేయాలని పేర్కొన్నారు. మీడియా ముందు ఏదీ పడితే అది మాట్లాడొద్దని హెచ్చరించారు రాహుల్ గాంధీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక.. బాగుపడింది కేసీఆర్ కుటుంబమేనని ఫైర్ అయ్యారు.