చార్మినార్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించిన రాహుల్ గాంధీ

-

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర హైదరాబాద్ మహానగరంలో ఉత్సాహంగా కొనసాగుతోంది. శంషాబాద్‌లోని మాతా టెంపుల్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన రాహుల్‌ ఆరాంఘర్‌, బహదూర్‌పురా మీదుగా యాత్ర సాగించారు. సాయంత్రం చార్మినార్‌ను సందర్శించారు. రాజీవ్‌గాంధీ సద్భావన యాత్రను స్మరించుకుంటూ.. చార్మినార్‌ వద్ద రాహుల్‌ గాంధీ జాతీయ పతాకం ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

చార్మినార్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం పురానాపూల్‌ వంతెన మీదుగా రాహుల్ యాత్ర కొనసాగించారు. రాహుల్‌ గాంధీ వెంట కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. హైదరాబాద్‌లో భారత్‌ జోడో యాత్రకు వెయ్యి మంది పోలీసులతో పటిష్ఠ భద్రత కల్పించారు. యాత్ర జరిగే ప్రాంతాలల్లో వాహనాల దారి మళ్లించారు. రాత్రి బోయిన్‌పల్లిలోని గాంధీ భావజాల కేంద్రంలో రాహుల్ విశ్రాంతి తీసుకోనున్నారు. బుధవారం ఉదయం నుంచి మళ్లీ యాత్ర కొనసాగిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news