అబద్దాలు చెప్పే విషయంలో అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువ అని నిపుణులు అంటున్నారు.. అబద్ధాలు చెప్పే వారిలో 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తారట. మిగిలిన 60 శాతం మంది అబద్ధాలు మాత్రమే చెబుతారట. మగాళ్లు ఎక్కువగా చెప్పే అబద్ధాలను అమ్మాయిలు ఎలాగో నమ్మరు. అయితే పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు.. నిజాల గురించి తమకు, తమ భాగస్వామికి తెలిసేంతవరకు అది అబద్ధమని వారు నమ్మరట. ఈ సందర్భంగా మగాళ్లు ఎక్కువగా ఎలాంటి అబద్ధాలు చెప్పి అమ్మాయిలను నమ్మిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం…
ముఖ్యంగా తన భార్యలు పుట్టింటికి వెళ్ళేటప్పుడు వెళ్లే సమయంలో భర్తలు భార్యపై ప్రేమను వ్యక్తపరుస్తూ ‘నువ్వు లేకుండా నేను ఉండలేను’ అని చెబుతూ ఉంటారట. అయితే అసలు విషయం మాత్రం వేరే ఉంటుందట. భార్య ఎప్పుడెప్పుడు పుట్టింటికి వెళ్తుందా? తమ బ్యాచ్ లర్ లైఫ్ ను మరోసారి ఆనందంగా గడిపేందుకు ఎంతో ఆశతో ఎదురుచూస్తారట. భర్తగా భార్య ముందు చేయలేనివన్నీ తమ భాగస్వామి వెళ్లిపోయాక అన్నింటినీ ఎంచక్కా ఎంజాయ్ చేస్తారట..ఆడాల్లు ఇది గుర్తు పెట్టుకోవడం మంచిది..
సాధారణంగా మగాళ్లందరూ చాలా ధైర్యంగా, బలంగా ఉంటారని చెబుతూ ఉంటారు. ఇలాంటి వారితో తాము సేఫ్ గా ఉన్నామని ప్రతి ఒక్క మహిళ భావిస్తు ఉంటుంది. అయితే వాస్తవానికి, మగాళ్లు కూడా అమ్మాయిల మాదిరిగానే ఎమోషనల్ అవుతారట. వారికి కూడా సెన్సిటివ్ మనసు ఉంటుందని, వారికి కూడా భయమేస్తుందట. అయితే అది వారు బయటపెట్టరట..
ప్రతి ఒక్క మగాడికి రొమాన్స్ విషయంలో పూర్తి అవగాహన ఉంటుందని.. తాము ఆ కార్యం పట్ల ఎంతో ఆసక్తితో ఉన్నామని.. తమకంతా తెలుసనే భావనలో ఉంటూ.. అమ్మాయిల ముందు ఫోజులు కొడతారట. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం చాలా భిన్నంగా ఉంటుందట. ఎందుకంటే చాలా మంది మగాళ్లకు సెక్స్ గురించి పూర్తిగా తెలియదు. వారిలో కొందరు ఉన్నతంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తారు..ఇది బాగా గుర్తు పెట్టుకోండి..