తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేం – కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్

-

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేమని స్పష్టం చేశారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. రైల్వేల భవిష్యత్తు అవసరాలకు కూడా సరిపోయే కోచ్ ల తయారీ సామర్థ్యం ప్రస్తుతం ఉందన్నారు. రాజ్యసభలో టిఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

అలాగే ఏపీలో కోటిపల్లి- నర్సాపూర్ న్యూ లైన్ ప్రాజెక్టు ఆగిపోయిందని కేంద్రం స్పష్టం చేసింది. ప్రాజెక్టులో తన వాటాగా చెల్లించాల్సిన వాటాను ఏపీ ప్రభుత్వం ఇవ్వడం లేదని.. ఈ ప్రాజెక్టు ఖర్చులో 25% భాగస్వామ్యం చెల్లించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటాని ఇవ్వకపోవడం వల్లే ప్రాజెక్టు ఆగిపోయిందని స్పష్టం చేసింది. టిడిపి ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news