2023 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ కొత్తరూల్‌.. పాస్‌వర్డ్‌ షేర్‌ చేస్తే పైసల్‌ కట్టాల్సిందే..

-

ఈరోజుల్లో థియేటర్లో వచ్చిన ఏ సినిమా అయిన నెలలోపే ఓటీటీలో వస్తుంది. అన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ సబ్‌స్క్రిప్షన్స్‌ తీసుకుంటే చాలు.. ఇంట్లోనే చిన్న సైజ్‌ థియేటర్‌ ఉన్నట్లే. అయితే మనం అందరం చేసే కామన్‌పని ఏంటంటే..ఫ్రెండ్‌గాడి పాస్‌వర్డ్‌ తీసుకుని మనమూ చూస్తాం.. అందరి దగ్గర ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ఉంటుంది..కానీ అది వాళ్లది కాదు.. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌ అయితే మరీ.. హాట్‌కెకుల్లా షేర్‌ చేస్తాం.. అయితే న్యూయర్‌ నుంచి నెట్‌ఫ్లిక్స్‌ కొత్త రూల్స్‌ తీసుకొచ్చింది.సబ్‌స్క్రైబర్ల సంఖ్య తగ్గిపోవడానికి పాస్‌వర్డ్‌ షేరింగ్‌ ప్రధానకారణంగా ఓటీటీ సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాస్‌వర్డ్‌ షేరింగ్‌ ఫీచర్‌ను నెట్‌ఫ్లిక్స్‌ తొలగించాలని భావిస్తోంది. 2023 నుంచి యూజర్లు తమ నెట్‌ఫ్లిక్స్ ఖాతాల పాస్‌వర్డ్‌లను ఇతరులతో షేర్‌ చేయడం సాధ్యంకాదని పేర్కొంది.

గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా సబ్‌స్క్రైబర్ల సంఖ్య తగ్గిపోయినట్లు ఈ ఏడాది మొదట్లో నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది. పాస్‌వర్డ్‌ షేరింగ్‌ వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు భావించిన నెట్‌ఫ్లిక్స్ ఈ ఫీచర్‌ను తొలగించాలని నిర్ణయించిందట. ఒకవేళ యూజర్లు తమ పాస్‌వర్డ్‌ను ఇతరులతో షేర్‌ చేసుకోవాలంటే నెట్‌ఫ్లిక్స్‌కు అదనంగా కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.. వచ్చే ఏడాది నుంచే దీన్ని అమలు చేయనున్నట్లు సమాచారం.

ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌ ఈ విధానాన్ని లాటిన్‌ అమెరికా, కోస్టారికా, చిలీ, పెరూ వంటి దేశాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఆ దేశాల్లో పాస్‌వర్డ్ షేరింగ్ రుసుము మూడు డాలర్లుగా అంటే సుమారు రూ. 250గా కంపెనీ నిర్ణయించింది. ఒకవేళ యూజర్‌ రుసుము చెల్లించకుండా పాస్‌వర్డ్‌ షేర్‌ చేస్తే.. ఐపీ అడ్రస్‌, డివైజ్‌ ఐడీ, అకౌంట్‌ యాక్టివిటీ ఆధారంగా వాటిని అడ్డుకునే వీలుంది.. గత కొద్ది నెలలుగా సబ్‌స్క్రైబర్ల సంఖ్యను పెంచుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ తీవ్రంగా కృషి చేస్తోంది. అందులో భాగంగా పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను తొలగించనుంది.

నెట్‌ఫ్లిక్స్‌ ఇటీవలే యాడ్‌లతో కూడిన కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను 6.99 డాలర్ల సుమారు రూ. 578కు అమెరికాలో పరిచయం చేసింది. త్వరలోనే ఈ ప్లాన్‌ను ఇతర రీజియన్లలో తీసుకొస్తారని సమాచారం. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ భారత్‌లో నాలుగు ప్లాన్లను అందిస్తోంది. అవి మొబైల్‌, బేసిక్‌, స్టాండర్డ్‌, ప్రీమియం ప్లాన్లు. మొబైల్ ప్లాన్‌ నెలవారీ రుసుము రూ. 149, బేసిక్‌ ప్లాన్‌ రుసుము రూ. 199కాగా, స్టాండర్డ్‌ ప్లాన్‌ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ధర రూ. 199, ప్రీమియం ప్లాన్‌కు రూ. 649 చెల్లించాలి. పాపం ఈ వార్త నెటిఫ్లిక్స్‌ ఫ్యాన్స్‌కు షాకింగానే ఉంటుందేమో..!!

Read more RELATED
Recommended to you

Latest news