రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 రోజులు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఇవాల్టి నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒకటి, రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఈశాన్య దిశ నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల కారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉష్ణోగ్రతలు తగ్గినట్లు వివరించింది. ఇక అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, వైయస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.