కొద్ది రోజుల విరామం తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని నగరం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచి పటాన్‌చెరు, కూకట్‌పల్లి, మియాపూర్, మూసాపేట్‌లో కురుస్తున్న వర్షం కురుస్తోంది. ఎర్రగడ్డ, సనత్‌నగర్, అమీర్‌పేట్, బేగంపేట్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లకిడికాపూల్‌లో చిరుజల్లులు ప్రజలకు సాంత్వన కలిగిస్తున్నాయి. ఇక ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, కోటి, దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో కురుస్తున వర్షంతో ఆయా ప్రాంతాలు జలమయమయ్యాయి.
తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా వాన కురుస్తుండటంతో రోజువారి కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాలు చిరుజల్లులకే చిత్తడయి.. రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. మరోవైపు ఉదయాన్నే తమ పనులపై వెళ్లే వారు వర్షం కారణంగా కాస్త అవస్థలు పడుతున్నారు. చాలా రోజుల తర్వాత వర్షం కురుస్తుండటంతో నగర ప్రజలు సేద తీరుతున్నారు. గత వారం పది రోజుల నుంచి నగరంలో ఎండలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వర్షం కురుస్తుండటంతో నగర వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.