తనపై జరిగిన హత్యయత్నంపై రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు !

-

తనపై జరిగిన హత్యయత్నంపై రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. దీంతో అనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఇద్దరు వ్యక్తులను విచారిస్తున్నారు మంగళహాట్ పోలీసులు. అయితే.. దీనిపై రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Raja Singh made sensational comments

నా ఫోటోలు తీసి ముంబైకి పంపిస్తున్నారు.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇంటి వద్ద ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించడంపై స్పందించిన రాజాసింగ్…నిన్న రాత్రి నలుగురు అనుమానితులు వచ్చారన్నారు. అందులో ఇద్దరు పారిపోగా.. మరో ఇద్దరిని స్థానికులు పట్టుకున్నారని వెల్లడించారు. అనుమానితుల సెల్ ఫోన్ లో మా ఇంటి ఫోటోస్, నా ఫోటోస్ ముంబైలో ఉన్న కొందరికి పంపినట్లు గుర్తించారని.. గతంలో కూడా మా ఇంటి వద్ద ఐఎస్ఐ తీవ్రవాదులు రెక్కీ నిర్వహించారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news