మంత్రి తలసాని చాలా బాగా పని చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మెచ్చుకున్నారు. గోషామహల్ లోని ముర్లిధర బాగ్ లో ఇటీవల నిర్మించిన 120 డబల్ బెడ్ రూం ఇళ్లను లబ్ధిదారులకు అందించారు మంత్రులు తలసాని, మహమూద్ అలీ.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ… 2017 లో ఇక్కడ చాలా ఘోరంగా పరిస్థితి ఉండేది… కొంత లేట్ అయినా ఇప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చాయని వివరించారు. మంత్రి తలసాని చాలా బాగా పని చేస్తున్నారు… ఆయన అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతున్నారని కొనియాడారు.
ఇక్కడి ప్రజలకి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడం చాలా సంతోషం.. .ప్రధాని నరేంద్రమోడీ దేశంలో అందరికీ ఇండ్లు ఉండాలి అంటున్నారన్నారు. ప్రధానమంత్రి అవాస్ యోజన , తెలంగాణ ప్రభుత్వం కలిపి ఇక్కడ ఇండ్లు నిర్మించారు… పక్కనే మరికొంత మంది ఇండ్లు అడుగుతున్నారు… వారికి కూడా ఇళ్ళు ఇవ్వాలని కోరారు.