రాజాసింగ్ పీడీ యాక్ట్ కేసు పై రేపు విచారణ

-

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ( పీడీ యాక్ట్) కింద మంగళహాట్ పోలీసులు ఆగస్టు 25వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చర్లపల్లి లోని సెంట్రల్ జైలుకు ఆయనని తరలించారు. దీనిని సవాల్ చేస్తూ రాజాసింగ్ భార్య ఉషాబాయ్ హైకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని 14, 21 అధికారానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 26 నుంచి రాజా సింగ్ ను అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు.

పలు కేసుల గురించి చెప్పకుండానే పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయడం అన్యాయమని ప్రస్తావించారు. రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె కోరారు. ఇదిలా ఉంటే.. రేపు పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు ముందు రాజాసింగ్ హాజరుకానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పిడి యాక్ట్ అడ్వైజరీ బోర్డు రాజాసింగ్ ను విచారించనుంది. పోలీసుల రికార్డుల ప్రకారం 2004 నుండి రాజాసింగ్ పై మొత్తం 101 క్రిమినల్ కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news