తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా..ఎమ్మెల్యే రాజాసింగ్ కు పాజిటివ్

తెలంగాణలో కరోనా విలయతాండవం రోజు రోజుకు తగ్గు ముఖం పడుతోంది. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 403 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 7,96,704 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో మరణాలు సంభవించలేదు.

దీంతో ఇప్పటి వరకు 4111 మంది కరోనా మహమ్మారి తో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు 2375 గా ఉన్నాయి.ఇక ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 7,90,218 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు.

ఇది ఇలా ఉండగా.. తాజా గా బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు ఉండటంతో.. ఆయన పరీక్షలు చేయించుకున్నారు. అయితే.. ఈ పరీక్షల్లో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు కరోనా పాజి టివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హెం ఐసోలేసన్‌ కు వెళ్లారు.