హిమాయత్ సాగర్ జలాశయం వద్ద ప్రమాద ఘంటికలు చోటు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలోనే.. హిమాయత్ సాగర్ జలశాయాన్నీ సందర్శించారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్. ఎగువ ప్రాంతాల నుంచి హిమాయత్ సాగర్ జలాశాయంలోకి వస్తున్న వరద ప్రవాహాన్ని జలమండలి అధికారులతో కలసి పర్యవేక్షించారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్.
గడిచిన 24 గంటల్లోనే జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, గండిపేట్, జలాశాయాలకు,4 అడుగుల మేర వరద నీరు వచ్చిందని అధికారులు గుర్తించడం జరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు…. జంట జలాశాయాల క్రస్టర్ గేట్లను పరిశీలించడం జరిగింది. వరద ఉదృతి ఇదే విధంగా కొనసాగుతే ఏక్షణమైనా గేట్లను ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేసే అవకాశం ఉందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ చెబుతున్నారు. ఇప్పటికే మూసి దిగువ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమతం చేసినట్లు తెలిపారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్.