తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తోందని ప్రభుత్వం నిన్న కీలక నిర్ణయం తీసుకుంది. మే 12నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ సంచలన ప్రకటన చేసింది. అయితే ప్రభుత్వం ఇలా లాక్‌డౌన్ ప్రకటన చేసిందో లేదో.. రాష్ట్రం మొత్తం గందరగోళం మొదలైంది. మరీ ముఖ్యంగా వైన్స్ షాపులు పది రోజుల పాటు బంద్ ఉంటాయేమో అని జనం ఒక్కసారిగా వైన్స్ వద్దకు పరుగులు తీశారు.
పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా.. కిలోమీటర్ల మేర క్యూ లైన్లు దర్శనమిచ్చాయంటే మన మందుబాబుల ముందు చూపు అర్థం చేసుకోవచ్చు. అయితే నిన్న ఒక్కరోజు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి.
లాక్‌డౌన్ ప్రకటించిన మూడు గంటల్లోపే రూ.56కోట్ల విలువైన మద్యం బాటిళ్లు గోదాముల నుంచి షాపులకు సరఫరా జరిగింది. ఇక రాత్రి 8గంటల్లోపే ఏకంగా రూ.125కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ సంవత్సంరలో ఒక్కరోజులో ఇంతగా అమ్మకాలు జరగడం ఇదే మొదటిసారి. ఈ వార్త విని మందుబాబులు తెగ కుషీ అవుతున్నారు.