ఆందోల్ బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించండి : కాంగ్రెస్

-

ఆందోల్ బీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ కుటుంబ సభ్యుల వివరాలు, ఆదాయానికి సంబంధించిన వివరాలను అఫిడవిట్ లో పొందుపరచలేదని.. నామినేషన్ ను తిరస్కరించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏజెంట్ అద్దంకి వీరన్న, హైకోర్టు న్యాయవాదులు డిమాండ్ చేశారు. సోమవారం ఎన్నికల ప్రక్రియలో భాగంగా వారు నామినేషన్ పత్రాల పరిశీలనలను చేపట్టారు. ఆందోళు అసెంబ్లీ స్థానానికి 22 మంది అభ్యర్థులు కాగా.. 38 నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా అద్దంకి వీరన్న, న్యాయవాదులు శ్రీధర్, రాంబాబులు మీడియాతో మాట్లాడారు.

బీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరన్ అఫిడవిట్ లో వివరాలను ఇవ్వలేదన్నారు. 2021-22లో తనకు వార్షిక ఆదాయం 0 అని చూపించారు. ఎమ్మెల్యేగా ప్రభుత్వ వేతనం తీసుకోలేదా..? భూమికి సంబంధించిన ప్రతీ ఆరు నెలలకొకసారి రైతుబంధు రాలేదా అని ప్రశ్నించారు. అంతేకాదు.. కుటుంబ సభ్యుల వివరాలను సైతం తప్పుగా చూపించాడు. అతనికి కుమారుడు చంటి అశాంక్ మైనర్ బాలుడు ఉన్నప్పటికీ అఫిడవిట్ లో దాఖలు చేయలేదని వెల్లడించారు. ఎన్నికల నిబంధనలను పాటించకుండా.. ఎన్నికల సంఘాన్ని తప్పుడు దోవ పట్టిస్తున్నారని.. అతని నామినేషన్ ను వెంటనే తిరస్కరించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news