తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు చదువులపై మరింత శ్రద్ధ పెట్టే సమయం ఆసన్నమైంది. తాజాగా ఈరోజు ఎస్ఎస్సీ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది ప్రభుత్వం. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చిన కొద్ది సేపటికే టెన్త్ షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. మే 23వ తేదీ నుంచి జూన్ 1 వరకు పరీక్షలు జరుగనున్నాయి. రెగ్యులర్, ఒకేషన్ విద్యార్థులకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో.. పెద్దగా తీవ్రత లేకపోవడంతో తెలంగాణ విద్యా శాఖ ఇన్ టైమ్ లో పరీక్ష షెడ్యూళ్లను విడుదల చేసింది.
తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదల అయింది. మే 6వ తేదీ నుంచి మే 23 తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. అయితే ఇంటర్ పరీక్షలు ముగిసే రోజే… టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. గతంలో మే 11వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ ప్రకటించినా.. మారిన ఇంటర్ షెడ్యూల్ ఫలితంగా టెన్త్ షెడ్యూల్ ను కూడా సవరించారు.