నియంతృత్వ ధోరణికి తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారు – గవర్నర్ తమిళి సై

-

నియంతృత్వ ధోరణికి తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు తెలంగాణ గవర్నర్ తమిళి సై. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై..తన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల పాలనలో విధ్వంసానికి గురైన రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలు ఈ ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే మళ్లీ పునర్ నిర్మించుకుంటున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో రాజ్యాంగబద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునరుద్ధరణ చేసుకుంటున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నానని తెలిపారు. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్య, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయన్నారు. ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి శోభనివ్వవని తెలిపారు. కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఈ స్పృహతో పని మొదలు పెట్టింది. సమాజంలోని అన్నీ వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో పని చేస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news