తెలంగాణ గవర్నర్ తమిళి సై ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడారు. గవర్నర్ గా ప్రమాణం చేసి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలతో నన్ను కట్టడి చేయలేరు. నాది మోసం చేసే మనస్తత్వం కాదన్నారు. రాజ్ భవన్ కి ప్రగతి భవన్ కి గ్యాబ్ లేదు అని పేర్కొన్నారు. సీఎం తో నాకు ఎలాంటి దూరం లేదు. నేను నా మార్గం లోనే ప్రయాణిస్తాను.దూరం గురుంచి నేను పట్టించుకోను. బిల్లుల విషయం లోఅభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయి.
ఫైటింగ్ కాదు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం అన్నారు. కొన్ని బిల్స్ నేను క్లియర్ చేశాను. బిల్లు లు ఆపడం లో నాకు వచ్చే లాభం ఎంటి.. నేను రాజకీయాలు చేయడం లేదు. నేను దేన్నీ తేలికగా తీసుకోను.. స్టడీ చేస్తాను, లీగల్ ఒపీనియన్ తీసుకుంటాను .గవర్నర్ కోట ఎమ్మెల్సీ లకు ఒక క్రైటిరియా ఉంటుంది అన్నారు. ఆ కేటగిరీ కింద ఫిట్ కానప్పుడు నేను అపాను. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రాజకీయ పరమైన భర్తీ కాదు అన్నారు. అదేవిధంగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఖండించింది గవర్నర్ తమిళి సై.