రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వొద్దని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో జరుగుతున్న తానా సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వొద్దన్నారు. తెలంగాణలో రైతులకు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు.. కేసీఆర్ అనవసరంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాడని ఆగ్రహించారు.
అనవసరంగా ఉచితాలు ఇవ్వొద్దని అమెరికా పర్యటనలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కి నలుగురు ముఖ్యమంత్రులు ఉంటే అందులో ముగ్గురు బీసీ లేనని అన్నారు. దీంతో తెలంగాణలో సీతక్కకి ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తారా..? అని ప్రశ్నించారు ఎన్. ఆర్.ఐ లు. దీంతో స్పందించిన రేవంత్ రెడ్డి.. ఈ విషయాన్ని పార్టీలో చర్చిస్తామని అన్నారు. అవసరమైతే, ఆ సందర్భం వస్తే ఉపముఖ్యమంత్రి ఎందుకు.. సీతక్క ముఖ్యమంత్రి అవుతారని కీలక వ్యాఖ్యలు చేశారు.